మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఒకవైపు ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్, మరొకవైపు భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే.. న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ మాత్రం టెస్టు చాంపియన్‌షిప్‌లో లేదు. ఏ దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయినా టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం అనుకుంటే పొరపడినట్లే. ఇప్పుడు న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ల సిరీస్ ఇందుకు ఉదాహరణ. ఇందుకు కారణం.. ప్రపంచ టెస్ట్ చాంపి యన్‌షిప్(2019-21) నిబంధన ప్రకా రం ప్రతిజట్టూ ఆరు సిరీస్‌లు ఆడాలి.
ఇందులో స్వదేశంలో మూడు విదేశంలో మూడు ఉంటాయి. అందువల్ల అన్ని సిరీస్ లను టెస్ట్ చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. వాటిలో ప్రస్తుత ఇంగ్లండ్-కివీస్‌ల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ ఒకటి. ఈ సిరీస్‌ను కూడా చేర్చితే.. ఇంగ్లండ్ బయట ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సి వచ్చేది. అలా జరిగితే మొత్తం చాంపియన్ షిప్ షెడ్యూల్ కాస్త అయోమయంలో పడేది. దాంతోనే ఈ టెస్టు సిరీస్‌ను వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. దాంతో న్యూజిలాండ్ గెలిచినా టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లు రావు. ఇది ఒకవేళ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే తొలి టెస్టులో గెలిచిన కివీస్ ఖాతాలో 60 పాయింట్లు చేరేవి.