న్యూజెర్సీతో ఒప్పందం

  హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక రంగంలో మరో ముందడుగు వేసింది. పునరుత్పాదక రంగంలో అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఒకే భాష. మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ కే జోషి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఈ ఒప్పందం ద్వారా రెండు రాష్ట్రాల్లో జియో థర్మల్, థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ విభాగాల్లో మరింత పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సోలార్ ద్వారా 20.41 గిగావాట్లు, విండ్ ఎనర్జీ ద్వారా 4.2 గిగావాట్ల శక్తితో కలిపి మొత్తంగా 4 వేల 36 మెగావాట్ల పునరుత్తాదక శక్తిని సాధించిందన్నారు. తెలంగాణలో వాణిజ అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మార్పీ అన్నారు.